నా నరనరాల్లో కామెడీ ప్రవహిస్తది..అట్లుంటది మనతోని!
on Dec 3, 2022
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ముక్కు అవినాష్. తన కామెడీతో, ఓవర్ యాక్షన్ తో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు అవినాష్ ఆహాలో స్టార్ట్ ఐన కామెడీ స్టాక్ ఎక్స్చేంజిలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ స్టాక్ గా ముక్కు అవినాష్ వచ్చాడు. అసలే అవినాష్ బాలయ్య వీరాభిమాని.
ఇక బాలయ్య రేంజ్ లో "జై బాలయ్య, నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు..వెల్కమ్ టు కామెడీ స్టాక్ ఎక్స్చేంజి..అన్ స్టాపబుల్... ప్రతీ ఒక్కరి నరాల్లో రక్తం ప్రవహిస్తే...నా నరనరాల్లో కామెడీ ప్రవహిస్తది..అట్లుంటది మనతోని " అని అద్దిరిపోయే డైలాగ్ తో తన ఎంట్రీని హైలైట్ చేసుకున్నాడు.
ఇక అవినాష్ చార్ట్ లో ఓవర్ యాక్షన్ 50 పర్శంట్, ముక్కు 30 పర్శంట్ , టైమింగ్, స్పాంటేనిటీ, నాన్-సింక్ కలిపి 20 పర్శంట్ వచ్చింది. "ఇందులో కామెడీ ఎక్కడుంది అవినాష్" అని హోస్ట్ దీపికా పిల్లి అడిగేసరికి "నీ దగ్గర యాంకరింగ్ ఎక్కడ ఉంది" అని రివర్స్ కౌంటర్ వేసాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
